- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒంటరిగానే అధికారంలోకి వస్తాం : కేసీఆర్

దిశ, ములుగు : మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యానిఫెస్టోలో పెట్ట కున్నా కల్యాణలక్ష్మి, రైతు బంధు పథకాలను ప్రజలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదీ, అయితే... హామీలను అమలు చేయని ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాని దీ అని అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరిట రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 180 కిలోమీటర్ల పాదయాత్ర శనివారం కేసీఆర్ ఫాం హౌజ్ కు చేరుకుంది. ఈ ముగింపు సభ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ కు ఆనాడు బలవంతంగా ఆంధ్రంలో కలిసి ఇందిరా గాంధీ మోసం చేశారన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచే వాడే కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్ లా తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని.. పదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే అధికారంలోని రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మెడపై కత్తి పెట్టిన తెలంగాణ ప్రయోజనాల కోసం వెనకడుగు వేయలేదని, తెలంగాణ కోసం పోరాడే దీ బీఆర్ ఎస్ పార్టీ నే అని స్పష్టం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగల మాదరి సిరి సంపదల తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు.రామగుండం ఎమ్మెల్యే ఓ సన్నాసి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పుట్ట మధు, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.