IBPS PO: బ్యాంక్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఐబీపీఎస్ పీఓ అడ్మిట్ కార్డులు విడుదల

by Maddikunta Saikiran |
IBPS PO: బ్యాంక్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఐబీపీఎస్ పీఓ అడ్మిట్ కార్డులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) జులై 31న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 19, 20, 30 తేదీల్లో 'ప్రిలిమ్స్(Prelims)' పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను నవంబరు 21న ఐబీపీఎస్ విడుదల చేసింది. కాగా ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు నవంబరు 30న మెయిన్స్ పరీక్ష(Mains Exam)ను నిర్వహించనున్నారు.

అయితే దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను(Admit cards) ఐబీపీఎస్ తాజాగా విడుదల చేసింది. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్(Registration No), పాస్ వర్డ్(Password) వివరాలు నమోదు చేసి అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 30 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును తమ వెంట తీసుకెళ్లాలి.

Next Story