Hikes Milk Price: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన పాల ధరలు

by Prasad Jukanti |
Hikes Milk Price: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన పాల ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యులకు షాకులిస్తూనే ఉన్నాయి. తెల్లవారగానే అందరి ఇళ్లలో ఉపయోగించే పాల ధరలు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నందిని పాల (Nandini Milk) ధరలను పెంచుతూ (Hike) కర్ణాటక (Karnataka) కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా లీటర్ కు రూ.4 చొప్పున పెంచేందుకు మంత్రిమండలి డెసిషన్ తీసుకున్నట్లు కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె. వెంకటేశ్ వెల్లడించారు. పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు నందిని పాలు, పెరుగు విక్రయ ధరను లీటరుకు రూ.4 చొప్పున పెంచుతున్నట్లు చెప్పారు. పెరిగిన కొత్త ధరలు ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో నందిని పాలు (నీలి ప్యాకెట్‌లో పాశ్చరైజ్డ్ టోన్డ్ పాలు) యొక్క ప్రాథమిక రకం ధర లీటరుకు రూ.42 నుండి రూ.46కు, పెరుగు ధరను లీటరుకు రూ.50 నుంచి రూ.54కు పెరగనుంది.

Next Story

Most Viewed