సమగ్ర వైద్య పరీక్షలతోనే వ్యాధుల అంతం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Mahesh |
సమగ్ర వైద్య పరీక్షలతోనే వ్యాధుల అంతం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమగ్ర వైద్య పరీక్షలతోనే వ్యాధులను నిర్ధారించి చికిత్సతో నయం చేయవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆదివారం రాజ్ భవన్ లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ ద్వారానే వ్యాధులను గుర్తించవచ్చని తెలిపారు. రెగ్యూలర్ హెల్త్ స్క్రీనింగ్ ల ప్రాముఖ్యతను గవర్నర్ వివరించారు. అనంతరం రాజ్ భవన్ సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అల్లోపతి, ఆయుర్వేదం, డెంటల్, పారా మెడికల్ బృందాలకు చెందిన ప్రత్యేక వైద్యులు రాజ్ భవన్ సిబ్బందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. రాజ్ భవన్ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం తో పాటు మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ జె.భవానీశంకర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed