- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా స్కూల్ విద్యార్థిని మృతి
by Sridhar Babu |
X
దిశ,జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో నిత్యశ్రీ (15) అనే పదవ తరగతి విద్యార్థిని మృతి చెందింది. గత కొన్ని రోజుల క్రితం విద్యార్థిని కాలుకు గాయం కాగా పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన కూతురిని ఇంటికి తీసుకు వెళ్లిన తల్లిదండ్రులు చికిత్స అందించి తిరిగి పాఠశాలకు పంపించారు.
రెండు రోజుల క్రితం విద్యార్థినికి మళ్లీ జ్వరం వచ్చింది. దాంతో సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. కస్తూర్బా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి వనపాకుల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు.
Advertisement
Next Story