Trending: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు మాస్ డాన్స్.. చూసి మురిసిపోయిన తాత(వీడియో)

by Kavitha |
Trending: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు మాస్ డాన్స్.. చూసి మురిసిపోయిన తాత(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనోత్సవ వేడుకలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున భక్తులు తండోప తండాలుగా తరలివచ్చి గణపయ్యలకు వీడ్కోలు పలికారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ఇక పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి మనవడు చేసిన మాస్ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. నిమజ్జనానికి తరలిస్తున్న వాహనం ముందు రేవంత్ మనువడు డప్పుల దరువులకు అనుగుణంగా ముద్దుముద్దుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అతని సతీమణి, అతని కూతురు బుడ్డోడి డాన్స్ చూసి మురిసిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు ఓ సారి ఆ వీడియో పై లుక్ వేసేయండి.

(VIDEO LINK CREDITS TO TELUGU INSIDER X ACCOUNT)

Advertisement

Next Story

Most Viewed