బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు.. రిసార్ట్స్‌లో అలా చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-19 11:34:46.0  )
బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు.. రిసార్ట్స్‌లో అలా చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంట్రాక్టర్‌పై బెదిరింపులు, కులదూషణలు చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న (BJP MLA Muniratna)కు మరో బిగ్ షాక్ తగిలింది. మునిరత్న తనపై అత్యాచారం చేయడంతోపాటు హనీట్రాప్ (Honeytrap) చేయించాడంటూ ఓ మహిళా సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ (Kaggalipura Police Station)లో గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ (Rajarajeshwari Nagar) నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనకు ప్రజాజీవితంలో పరిచయమయ్యాడని 40 ఏళ్ల మహిళా సామాజిక కార్యకర్త తెలిపింది. ఆ పరిచయంతో తరచూ తనకు ఫోన్లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నాడని పేర్కొంది. ఈ క్రమంలోనే ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని బుధవారం రాత్రి కగ్గలిపుర పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఘటన తర్వాత విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని పిటిషన్‌లో తెలిపింది. అంతేకాక వివిధ రిసార్ట్స్‌(Resorts)కు తీసుకెళ్లి అక్కడ హనీట్రాప్ చేయాలని బలవంతం చేశాడని, నా వల్ల కాదంటే చంపేస్తానని బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేశాడని వివరించింది.

సామాజిక కార్యకర్త అయిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్నతోపాటు ఆయన సహచరులు విజయ్ కుమార్, కిరణ్, లోమిత్, మంజునాథ్, లోకితో సహ మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 354 (ఎ), 354 (సి), 308, 406, 384, 120 (బి), 504, 506 , 149 కింద కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ ఎస్పీ దినకర్ శెట్టి మీడియాకు తెలిపారు. కాగా బెదిరింపుల కేసులో ఇప్పటికే బెంగళూరు సెంట్రల్ జైలు(Bangalore Central Jail)లో ఉన్న మునిరత్న బెయిల్‌పై ఈ రోజే విచారణ కొనసాగనున్నది. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ కేసులోనూ పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయనున్నాను. ఒకవేళ బెయిల్ రాకపోతే పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed