LIC Scheme: ఎల్ఐసీ కొత్త స్కీమ్.. మహిళలకు నెల నెలా చేతికి డబ్బులు

by Bhoopathi Nagaiah |
LIC Scheme: ఎల్ఐసీ కొత్త స్కీమ్.. మహిళలకు నెల నెలా చేతికి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రంలోని మోదీ(Prime Minister Narendra Modi) సర్కార్ మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు.. ఆర్థిక సాధికారత సాధించేలా ఎల్ఐసీ(LIC) ద్వారా సువర్ణ అవకాశం కల్పించేందుకు కొత్త స్కీమ్ తీసుకువచ్చింది మోదీ సర్కార్. ఎల్ఐసీ సంస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా సఖి యోజన స్కీం(Bima Sakhi Yojana Scheme)ను లాంచ్ చేసింది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Bima Sakhi Yojana Apply Online:

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation of India) భాగస్వామ్యంలో ఎల్ఐసీ బీమా సఖీ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ స్కీమ్ లో చేరే వారు ఎల్ఐసీలో మహిళా ఏజెంట్గా పని చేసే ఛాన్స్ పొందవచ్చు. మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా భరోసా కల్పించేలా ఈ స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హర్యానాలో పానిపట్ లో ప్రారంభించారు. ఇక ఈ స్కీంలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నెల కిందట ఈ స్కీం ప్రారంభించగా... ఇప్పటివరకు అంటే.. నెల వ్యవధిలోనే ఏకంగా 50 వేల మందికి పైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

బీమా సఖి యోజనలో నమోదైన 52,511 మందిలో ఇప్పటివరకు 27, 695 మంది బీమా సఖిలకు పాలసీని విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే ఇందులో 14,583 మంది పాలసీలు విక్రయించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

వచ్చే మూడేళ్లలో రెండు లక్షల మందికి పైగా బీమా సఖిలను నియమించుకోవాలన్న లక్ష్యంతో ఎల్ఐసీ ఉంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పదో తరగతి పూర్తయిన మహిళలు ఈ పథకంలో చేరేందుకు అప్లై చేసుకోవచ్చు. ఇక బీమా సఖిలో చేరేందుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ స్కీం కింద మహిళలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతినెల ఇందులో స్థాయి ఫండ్ కూడా అందిస్తారు. అదనంగా బోనస్ కమిషన్ కూడా ఉంటుంది. అయితే మహిళా ఏజెంట్లు టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇక స్టైఫండ్ గురించి తెలుసుకున్నట్లయితే.. ఇక్కడ మొదటి ఏడాదిలో ప్రతినెల 7000 రూపాయల చొప్పున అందుతుంది. రెండో ఏడాదిలో 6000 రూపాయలు.. మూడో ఏడాదిలో 5000 రూపాయలు చొప్పున అందిస్తారు. ఇక బోనస్ కాకుండా కమిషన్ ఏడాదికి 48 వేల రూపాయల వరకు వస్తుంది. ఇందుకోసం పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన టార్గెట్లలో కనీసం 65% పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే మహిళా కెరీర్ ఏజెంట్గా ఎంపికైన వారిని ఎల్ఐసీ ఉద్యోగ పరిగణించరనే సంగతి గుర్తుంచుకోవాలి. వారి పనితీరు ఆధారంగానే వారికి స్టైఫండ్ కొనసాగిస్తారు. ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లుగా ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు. ఏజెంట్ గా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను దరఖాస్తు ఫారంతో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వయస్సు, అడ్రస్, అర్హతలను ధ్రువీకరించేలా సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ సబ్మిట్ కూడా సబ్‌మిట్ చేయాలి. (https://agencycareer.licindia.in/agt_req/New_Lead_Sakhi_Candidate_Data_entry_For_NewWeb.php) దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Advertisement

Next Story