Former Minister Roja : అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు ఎందుకు పెట్టలేదు: మాజీ మంత్రి రోజా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-09 09:04:08.0  )
Former Minister Roja : అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు ఎందుకు పెట్టలేదు: మాజీ మంత్రి రోజా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరుగురు భక్తుల మృతికి దారితీసిన తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనపై అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్(AP) అధికార కూటమి పార్టీలకు, ప్రతిపక్షాలకు మధ్య పరస్పర విమర్శల దాడులు సాగుతున్నాయి. తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని, కుట్ర కోణంలోనూ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఓవైపు హోంమంత్రి అనిత(Home Minister Anita)ప్రకటించారు. ఇంకోవైపు ఈ ఘటనకు ప్రభుత్వం, టీడీడీ, పోలీసులు, అధికారులే బాధ్యత వహించాలంటూ ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడి చేస్తుంది.

ఈ నేపథ్యంలో తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా(Former Minister Roja) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంధ్య థియేటర ఘటన(Sandhya Theater stampede incident)పై అల్లు అర్జున్(Allu Arjun) పై పెట్టినట్లుగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేసు(Cases)లు ఎందుకు పెట్టడం లేదంటూ ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), టీటీడీ(TTD), ఎస్సీ(SP), కింది స్థాయి అధికారులే బాధ్యత వహించాలని వైసీపీ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.

తిరుపతి వైకుంఠ ఏకాదశికి ఏటా లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకుండా భక్తుల మరణానికి కారణమైన ఘటనకు వారు ఎందుకు బాధ్యత వహించరని రోజా ప్రశ్నించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనలో నేరుగా అల్లు అర్జున్ ప్రమేయం లేకున్నా.. ఆయనపై బీఎన్ఎస్ 105 సెక్షన్ పెట్టారని గుర్తు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో 105 సెక్షన్ కు బదులుగా 194బీఎన్ ఎస్ సెక్షన్ పెట్టారని, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ఎవరు కావాలని చేయలేదని, మాకు ఎవరికి ఇందులో సంబంధం లేదని తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారని రోజా విమర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పెట్టిన క్రిమినల్ సెక్షన్లు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎందుకు పెట్టరని రోజా నిలదీశారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం, టీటీటీ ఫెయిల్ అయ్యాయన్నారు. తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఘోర ఘటన ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. చంద్రబాబుది ఐరన్ లెగ్..! అప్పుడు గోదావరి పుష్కరాలు తొక్కిసలాట..ఇప్పుడు తిరుపతి తొక్కిసలాటని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. నిజమైన సనాతన యోధుడివైతే రాజీనామా చేయి.. లేకపోతే చంద్రబాబు చేత రాజీనామా చేయించని డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందన్న అబద్ధపు ప్రచారంపై బీజేపీ నాయకురాలు మాధవీలత వందేభారత్‌ రైలుతో భజన ద్వారా నిరసన తెలిపారని, నిజంగా మీకు దేవుడిపై భక్తి ఉంటే.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయండని రోజా సూచించారు. ఈ ఘటనలో భక్తుల చావుకి ఎవరెవరు కారణమయ్యారో.. ప్రధాని మోదీకి చెప్పి వారిపై క్రిమినల్ కేసులు పెట్టించండని కోరారు.

( Video Credit to YSR Congress Party - YSRCP- Official Facebook )

Advertisement

Next Story