N కన్వెన్షన్ కూల్చివేత.. అలా చేయడం చాలా మంచి పనంటూ నాగార్జున అన్నయ్య సంచలన కామెంట్స్

by Kavitha |
N కన్వెన్షన్ కూల్చివేత.. అలా చేయడం చాలా మంచి పనంటూ నాగార్జున అన్నయ్య సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌(N- CONVENTION) సెంటర్‌ను హైడ్రా(HYDRA) కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ కన్వెన్షన్‌ను కూల్చి వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగార్జున ఆరోజే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర విచారణను కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ స్టే ఆర్డర్ వచ్చే సమయానికి హైడ్రా అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారు. అయితే అది పట్టా భూమి.. చట్ట విరుద్ధమైతే తాను కూల్చేవాడినని సోషల్ మీడియాలో నాగ్ తెలిపారు. ఆ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉన్నానని, అప్పటి వరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తన ఆస్తి కూల్చివేత విషయంపై నాగ్ స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం, నాగార్జున వ్యక్తిత్వం గురించి ఆయన అన్నయ్య అక్కినేని వెంకట్(AKKINENI VENKAT) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆయన మాట్లాడుతూ.."నాగార్జునకు సంబంధించి ఇటీవల జరిగిన కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే. అదే ఎన్ కన్వెన్షన్ ల్యాండ్ కాంట్రవర్సీ. చాలా మంది ఏదో అనుకుంటారు. కానీ అతడు స్టైయిట్‌గా వెళ్తాడు. న్యాయపరంగా పోరాడుతున్నాడు. ఏ విషయంలోనైనా డిస్ట్రబ్ అయిపోయి.. బ్యాడ్‌గా రియాక్ట్ అయిపోయి.. ప్యానిక్ అయిపోయి.. ధర్నా చేసి.. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. అలా ఏం చేయడు. కామ్‌గా ఉన్నాడు. జస్ట్ ట్విట్టర్(X) మెసేజ్‌లు పెట్టాడు అంతే.

అక్కడితో వదిలేశాడు. అది చాలా మంచి పని. అందరికీ లైఫ్‌లో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఇష్టం ఉన్నది జరిగితే పర్లేదు.. కానీ ఇష్టం లేనివి కూడా జరుగుతుంటాయి. దానికి తోడు సెలబ్రిటీలు.. కాబట్టి పది రెట్ల ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎంతో మంది విషయంలో అలా జరిగినా.. అతడి విషయం ఫోకస్ అయింది. ముఖ్యంగా అతను ఎంటర్ అయితే కాంట్రవర్సీ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే సంయమనంతో ఉన్నాడు" అని నాగ్ బ్రదర్ అక్కినేని వెంకట్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అక్కినేని వెంకట్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు దట్ ఈజ్ కింగ్ (THAT IS KING) అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(VIDEO LINK CREDITS TO Nag Mama Rocks X ACCOUNT)

Advertisement

Next Story

Most Viewed