- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగ్గురు దొంగల అరెస్ట్.. 5 బైక్‌లు స్వాధీనం, రిమాండ్‌కు తరలింపు
దిశ భద్రాచలం: జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతోన్న ముగ్గురు వ్యక్తులు పట్టపగలే భద్రాచలం పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతోన్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గుగులోత్ శ్రీను, గణేష్, కోర రాజేష్‌తో పాటు బూర్గంపహాడ్ గాంధీనగర్‌కు చెందిన మరో ఇద్దరు కలిసి వరుసగా మోటార్ సైకిళ్లను దొంగిలించి అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పక్కా ప్లాన్‌తో దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లుగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగలు కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు దొంగలను పట్టుకోవడం కోసం తీవ్రంగా కృషి చేసిన సిబ్బందిని భద్రాచలం సీఐ సంజీవరావు అభినందించారు.