- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chittoor Accident : చిత్తూరు బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో 30 మంది వరకూ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.