హైదరాబాద్ హెచ్ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సు ప్రారంభం

by Mahesh |
హైదరాబాద్ హెచ్ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ జీడీపీలో పౌల్ట్రీ రంగం వాటా 1 శాతమని, పౌల్ట్రీ పరిశ్రమ దేశంలో కీలకంగా ఉందని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచీ ఘోష్ అన్నారు. హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ పౌల్ట్రీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ఉత్సవంగా ఇది నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ, విదేశీ, పౌల్ట్రీ పరికర తయారీదారులను ఒక చోట చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ, విదేశాల నుంచి హాజరైన 40 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకు న్నారన్నారు. రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు దోహదం చేస్తాయన్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్తమ పద్ధతులను అవలంభించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం, ఖర్చుల నిర్వహణను మెరుగు పర్చుకోవచ్చని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సులో నూతన పరిశోధనలు, టెక్నాలజీ మార్గదర్శకాలను అందించే గొప్ప వేదికగా మారుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed