- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
M&M: ఈవీ విభాగంలో రెండు కొత్త కార్లు విడుదల చేసిన మహీంద్రా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) కొత్తగా ఎలక్ట్రిక్ విభాగంలో రెండు ఈవీ ఎస్‌యూవీలను మంగళవారం విడుదల చేసింది. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ పేర్లతో తీసుకొచ్చిన ఈ కార్లు రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఎక్స్ఈవీ 9ఈ రూ. 21.90 లక్షల(ఎక్స్‌షోరూమ్) మొదలవుతుంది. 2025, మార్చి కల్లా డెలివరీలను అందించనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. బీఈ 6ఈ కారు, ఎక్స్ఈవీ 9ఈలు 59 కిలోవాట్ అవర్‌తో పాటు 79 కిలోవాట్ అవర్ బ్యాటరీలను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు మోడళ్లు ఒక్క ఛార్జింగ్‌తో 450-500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రెండు ఎస్‌యూవీలు ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. దానివల్ల కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం బ్యాటరీని ఛార్జింగ్ చేస్తాయి. ఇంటీరియర్ పరంగా ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌లో మూడు స్క్రీన్‌లను ఏర్పాటు చేశామని, బీఈ 6ఈ కారులో రెండు స్క్రీన్‌లను అమర్చినట్టు కంపెనీ తెలిపింది. బీఈ 6ఈలో డ్యూయల్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో పాటు ఇల్యూమినేటెడ్ కంట్రోల్స్, టూ-స్పోక్ స్టీరింగ్ ఉంటాయి. ఎక్స్ఈవీ 9ఈలో పనోరమిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఏడీఎస్ సిస్టమ్ ఉంటాయని కంపెనీ పేర్కొంది.