Space Station: భారత అంతరిక్ష కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

by Mahesh Kanagandla |
Space Station: భారత అంతరిక్ష కేంద్రానికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, నేషనల్ బ్యూరో: రోదసిలో భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, శుక్రగ్రహానికి సంబంధించి వీనస్ ఆర్బిటర్ మిషన్(వీఓఎం)కూ కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు ఇస్రో(ISRO) వెల్లడించింది. శుక్రయాన్(Shukrayaan) పార్ట్ 1కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇస్రో అహ్మదాబాద్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ తెలిపారు. వీఓఎం మిషన్‌ను 2028లో ప్రయోగిస్తామని చెప్పారు. గ్రహాల్లో జరిగే మార్పులను, భవిష్యత్‌లో ఇతర గ్రహాల మిషన్‌లపై ప్రయోగాలకు వీఓఎం ఉపకరించనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 16 ప్రజరైజ్డ్ మాడ్యూల్స్ ఉంటే భారత అంతరిక్ష కేంద్రా(బీఏఎస్/Bharat space Station)నికి ఐదే ఉంటాయని, ఇందులో తొలి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగిస్తామని దేశాయ్ వివరించారు. 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 2040కల్లా చంద్రుడిపై ల్యాండ్ కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, ఈ మిషన్‌కల్లా అంతరిక్ష కేంద్రం రెడీగా ఉంటుందని, ఆ ప్రయోగానికి బీఏఎస్ ఒక ట్రాన్సిట్ ఫెసిలిటీగా ఉపయోగపడుతుందని తెలిపారు. చంద్రయాన్ 4లో చంద్రుడిపై ల్యాండ్ అవ్వడమే కాదు.. అక్కడి రాళ్లు, మట్టి శాంపిళ్లను వెనక్కి తీసుకురావాలనే లక్ష్యాలూ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed