Israel Ceasefire: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ

by Mahesh Kanagandla |
Israel Ceasefire: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్‌(Lebanon)లోని హెజ్బొల్లా(Hezbollah)తో కాల్పుల విరమణ ఒప్పందాని(Ceasefire Deal)కి అంగీకరించింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ మంగళవారం ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో 13 నెలల దాడులకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్‌లో ఓటింగ్ తర్వాత మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. హమాస్‌ను ఏకాకి చేసి బంధీలను విడుదల చేయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హెజ్బొల్లా ప్రధాన నాయకులు మరణించడంతో ఆ సంస్థ కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, మూడు నెలల క్రితం ఇది అసాధ్యంగా కనిపించేదని వివరించారు. ఈ కాల్పుల విరణమపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు ప్రత్యేక ప్రకటనలు విడుదల చేసే అవకాశముంది. హమాస్‌కు మద్దతుగా యుద్ధంలోకి హెజ్బొల్లా దిగడంతో ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య సుమారు ఏడాది కాలంగా దాడులు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed