ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమం.. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై అవగాహన

by srinivas |
ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమం.. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై అవగాహన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, జీరో టిల్లేజి విధానంలో మొక్కజొన్న సాగుపై రైతులకు అవగహన కల్పించినట్లు వ్యవసాయ సంచాలకులు డా.గోపి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులతో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 34 ఎపిసోడ్ లను నిర్వహించి రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు డ్రోన్ల వినియోగం ఓ పరిష్కారంగా పేర్కోన్నారు. జీరో టిల్లేజి విధానంలో మొక్కజొన్న సాగు విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయన్నారు. ఈ విధానంలో మొక్కజొన్న సాగు చేస్తున్న చింతకాని మండంలకు చెందిన అభ్యుదయ రైతు నరసింహ రావు రాష్ట్రంలోని తోటి రైతులతో తన అనుభవాలను పంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed