Jaishankar: యుద్ధభూమిలో పరిష్కారం కనుగొనలేము.. విదేశాంగ మంత్రి జైశంకర్

by vinod kumar |
Jaishankar: యుద్ధభూమిలో పరిష్కారం కనుగొనలేము.. విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukrein) యుద్ధం, పశ్చిమాసియా(Middle east)లోని పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ భూమిలో ఏ దేశమూ పరిష్కారాన్ని కనుగొనలేదని నొక్కి చెప్పారు. మంగళవారం ఆయన ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచంలో ఏక కాలంలో జరుగుతున్న రెండు ప్రధాన ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను చూస్తే ప్రేక్షకుల్లా ఉండలేమని, పరిష్కారమార్గాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఈ రెండు సంఘర్షణలపై ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని, మెరుగైన ప్రయత్నాలతో వాటిని ఆపాలని సూచించారు. దౌత్య మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో సూచిస్తోందని స్పష్టం చేశారు. మాస్కో, కీవ్‌తో ఇంకా చర్చలు జరపాలని, ఇరు దేశాలు ఏం కోరుకుంటున్నాయో అప్పుడు మాత్రమే తెలుస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed