Srinivas Goud : బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టుకు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Y. Venkata Narasimha Reddy |
Srinivas Goud : బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టుకు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల పెంపు(BC Reservation Increase) కోసం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెలుదామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud)తెలిపారు. అఖిల భారత బీసీ ఫెడరేషన్ - బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్(Justice Easwaraiah Goud)సమక్షంలో నిర్వహించిన బీసీల సమాలోచన సమావేశంలో "సమగ్ర కులగణన నిర్వహణ - జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు" పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ , బీసీ రిజర్వేషన్లపై తయారు చేసిన చట్టం డ్రాఫ్ట్ పై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమిళనాడుకు వెళ్లి మేం బీజీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తామన్నారు. ఢిల్లీకి మన సంఘాల తరుపునా ప్రతినిధి బృందం వెళ్లి కేంద్రానికి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన వాదనను వినిపిద్ధామన్నారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో ఉద్యోగ రిక్రూట్ మెంట్లు, కళాశాలలు, మెడికల్ కాలేజీలలో కూడా బీజీ రిజర్వేషన్లు ఉల్లంఘన జరుగుతుందన్నరు. ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు ఇస్తారో లేదో ప్రభుత్వం తేల్చుకోవాలని, మనం మాత్రం అన్ని రకాలుగా రిజర్వేషన్ సాధనకు పోరాడాల్సిందేనన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కాళ్లు పట్టుకుంటుందో ఏం చేస్తుందో మనకు అనవసరమని, మనకు ఇస్తామన్న 42శాతం సాధించేందుకు పోరాడాలని సూచించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోనూ ఒక్క బీసీ న్యాయమూర్తి కూడా లేడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, టీపీసీసీ ప్రధాన అద్దంకి దయాకర్, బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ సహా పలు పార్టీల బీసీ నాయకులు, బీసీ సంఘాలు నాయకులు తమ అభిప్రాయాలు వినిపించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed