- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్
దిశ, స్పోర్ట్స్ : భారత ఫాస్ట్ బౌలర్, జార్ఖండ్‌కు చెందిన వరుణ్ ఆరోన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం వెల్లడించాడు. గతేడాది రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను తాజాగా జార్ఖండ్‌తో బంధానికి ముగింపు పలికాడు. ‘గత 20 ఏళ్లుగా వేగంగా బౌలింగ్ చేయడంలో జీవించాను. శ్వాసించాను. మెరుగయ్యాను. ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఫాస్ట్ బౌలింగ్ అనేది నా ఫస్ట్ లవ్. మైదానం నుంచి బయటకు వచ్చినా అది నాలోనే ఉంటుంది.’అని ఆరోన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌కు ఆడిన అతను నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. కాగా, 35 ఏళ్ల ఆరోన్ 88 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 141 వికెట్లు, 95 టీ20ల్లో 93 వికెట్లు తీశాడు. 2010-11 విజయ్ హజారే ట్రోఫీలో ఆరోన్ గంటకు 150 కి.మీ వేగంతో బంతి విసిరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అదే ఏడాది జాతీయ జట్టు నుంచి కూడా పిలుపు అందుకున్నాడు. భారత్ తరపున టెస్టు, వన్డేల్లో కలిపి 18 మ్యాచ్‌లు ఆడిన అతను 29 వికెట్లు తీశాడు. 2015లో టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. 2011-22 మధ్య ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడాడు. 2022లో విజేతగా నిలిచి గుజరాత్ టైటాన్స్ జట్టులో వరుణ్ సభ్యుడు.
- Tags
- #Varun Aaron