- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Virat Kohli : వృందావన్ సందర్శించిన విరాట్ కోహ్లీ కుటుంబం
దిశ, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) భార్య అనుష్క శర్మ(Anushka Sharma), కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ లతో కలిసి ప్రేమానంద్ మహారాజ్ వృందావన్(Vrindavan)ఆశ్రమాన్ని సందర్శించారు. విరాట్ కు ఈ ఆశ్రమం ఎంతో ఇష్టమని గతంలో వెల్లడించాడు. వృందావన్ సందర్శన సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ తో అనుష్క మాట్లాడారు.
గతంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు నా మెదడులో కొన్ని ప్రశ్నలు మిగిలాయని..వాటిని అడుగుదామనుకుంటే రద్దీ కారణంగా కుదరలేదన్నారు. అక్కడున్న వారు కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. ఆ మర్నాడు నేను ఏకాంత్ వ్రతాలాపన్ ను ఓపెన్ చేశానని(ప్రేమానంద్ ఆన్ లైన్ కార్యక్రమం) అందులో కొందరు నా మనసులో ఉన్న ప్రశ్నలే అడిగారని పేర్కొంది. తమకు ప్రేమ భక్తి కావాలని ఆమె కోరింది.
అనుష్క ప్రశ్నలకు ప్రేమానంద్ మహారాజ్ సమాధానమిస్తూ "మీరు చాలా ధైర్యవంతులని.. ప్రపంచంలో ఇంత గౌరవం లభించిన తర్వాత భక్తి మార్గం వైపు మళ్లడం చాలా కష్టమని.. మీ భక్తికి ఖచ్చితంగా సమాధానం పొందుతారని చెప్పారు. అనుష్క మాట్లాడుతున్నంతసేపు.. కోహ్లి తన కుమార్తెతో ముచ్చటించారు.
కరోలి ఆశ్రమంలో దాదాపు గంటపాటు బస చేసిన అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆనందమయి ఆశ్రమానికి బయలుదేరారు. కాగా, అనుష్క శర్మ కుటుంబం బాబా నీమ్ కరోలికి భక్తురాలు. 2023 జనవరిలో కూడా విరాట్-అనుష్క జంట ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బాబా నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
కెరీర్ లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లి వృందావన్ పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ విఫలమైన కోహ్లీ తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులలో ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేసి విమర్శలకు గురయ్యాడు. రానున్న ఇంగ్లాండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీపైన విరాట్ భవిష్యత్తుకు కీలకంగా మారింది.