- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Govt:‘ఇక నుంచి ఆ పేరు కనపడదు’.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన జగనన్న కాలనీల పేర్లను తొలగించారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీలో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మార్చుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పై ఈ కాలనీలకు ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్(Ajay Jain) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.