- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కల్లులో ఎలుకల మందు కలిపి కోడలికి తాగించిన అత్త.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటకు

దిశ, శంషాబాద్: తరచూ గొడవ పడుతుందని అత్త స్వయాన కోడలికి కల్లులో ఎలుకల మందు కలిపి తాగించి హత్య చేసిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంజపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన మూడవత్ ధూళి(38) గత రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండా పోయిందని, భర్త మూడవత్ సురేష్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గురువారం మృతురాలి అత్త అయిన మూడవత్ తులసిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో పోలీసులు విచారించగా హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది.
తన కోడలు మూడవత్ ధూళి తరచూ తనతో గొడవ పడుతుందని అత్త తులసి మనసులో పెట్టుకుంది. అత్త కొంతకాలంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయ్ గ్రామంలో ఒక తోటలో పనిచేస్తుంది. అయితే అత్త వద్దకు వచ్చిన మూడవత్ ధూళిని అత్త మాయమాటలు చెప్పి కల్లు దుకాణానికి తీసుకెళ్లి పథకం ప్రకారం ముందే ఎలుకల మందు తీసుకొని కల్లులో కలిపి మూడవత్ ధూళికి తాగించి హత్య చేసి కల్లు దుకాణానికి సమీపంలో ఉన్న మట్టి కుప్పలో పాతిపెట్టినట్లు నిందితురాలు నిజం ఒప్పుకోవడంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని, హత్య చేసిన నిందితురాలు మూడవత్ తులసిపై కేసు నమోదు చేసి శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.