- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూ.9కే ఫుల్ మీల్స్.. బంపరాఫర్ ఎక్కడో తెలుసా..?

దిశ, నేషనల్ బ్యూరో: మరో రెండు రోజుల్లో యూపీలో మహా కుంభమేళ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం 'మా కి రసోయి' అనే కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ హాస్పిటల్‌లో నంది సేవా సంస్థాన్ నిర్వహిస్తున్న ఈ కిచెన్‌లో కేవలం రూ.9కే ఫుల్ మీల్స్ అందించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చే పేద భక్తుల కోసం ఈ కిచెన్ ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. మహా కుంభమేళా ఏర్పాట్లను యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండో రోజు పర్యటిస్తూ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'మా కి రసోయి'ని ప్రారంభించి, అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అంతే కాకుండా కొంత మందికి వ్యక్తిగతంగా ఆహారాన్ని అందించారు.
'రాష్ట్రంలోని పేదలను, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఆదుకోవడానికి నంది సేవా సంస్థాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేవలం రూ.9కే ఫుల్ మీల్స్ అందిస్తున్నాము. భోజనంలో పప్పు, నాలుగు రోటీలు, కూర, అన్నం, సలాడ్‌తో పాటు ఒక డెజర్ట్ కూడా ఉంటుంది' అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. 'మా కి రసోయి' ప్రారంభించిన తర్వాత మంత్రి నందగోపాల్‌తో కలిసి సీఎం ఆదిత్యానాథ్ వంటగదిని పరిశీలించారు. అక్కడ ఆహార నాణ్యత, శుభ్రతా ప్రమాణాలు, ఇతర ఏర్పాట్లను సీఎంకు మంత్రి వివరించారు. ఈ కమ్యూనిటీ కిచెన్ ద్వారా కేవలం కుంభమేళాకు వచ్చిన వారికే కాకుండా.. ఎస్ఆర్‌ఎన్ ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి చెప్పారు. 'మా కి రసోయి'ని పూర్తిగా ఏసీతో, అధునాతన రెస్టారెంట్ లాగా తీర్చి దిద్దారు. 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కిచెన్‌లో ఒకే సారి 150 మంది కూర్చొని భోజనం చేసే వీలుంది.