విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష

by Gantepaka Srikanth |
విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ప్రముఖ యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫన్నీ వీడియోస్‌తో నెట్టింట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. మైనర్‌ను గర్భవతిని చేసిన కేసులో 2021లో విశాఖపట్టణంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్‌(Pendurthi Police Station)లో భార్గవ్‌పై పోక్సో కేసు నమోదైంది. తాజాగా.. ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు(Visakha POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది.

భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. టిక్ టాక్‌లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా కెరియర్ ప్రారంభించిన భార్గవ్.. ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. కామెడీ స్కిట్స్, పంచ్‌లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈ క్రమంలోనే తనకు పరిచమైన ఓ మైనర్ యూట్యూబర్‌పై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది. దాంతో 2021 ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో భార్గవ్‌పై పోక్సో కేసు నమోదైంది.

Next Story