ఖైదీలు బెయిల్ కోసం సంప్రదించండి

by Naveena |
ఖైదీలు బెయిల్ కోసం సంప్రదించండి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఖైదీలు బెయిల్ కోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును శుక్రవారం ఆమె సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న వసతులు,సదుపాయాలు అన్ని సరిగ్గా అందుతున్నాయా లేదా అని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి వంటగది,పరిసరాల పరిశుభ్రత,భద్రత ను ఆమె పరిశీలించారు. అనంతరం బ్యారక్ దగ్గరకు వెళ్ళి ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెయిల్ కోసం లీగల్ ఎయిడ్ అడ్వకేట్ కావాలంటే,జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని తెలుపుతూ,వారికి సలహాలు,సూచనలు ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed