పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్‌డేట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-21 12:59:34.0  )
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టా్త్మకంగా నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). దీనికి సగభాగం క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించగా.. మిగిలిన భాగాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna) పూర్తి చేస్తున్నాడు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే 95 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా.. మిగిలిన పోర్షన్‌ను చకచకా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. డబ్బింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు, టీచర్స్, పోస్టర్లు అభిమానులను, సినీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

హరిహర వీరమల్లుతో పాటు పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజీ(OG)తో పాటు హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఓజీ షూటింగ్ కూడా 80 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దసరా వేళ విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది. ఇక హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) షూటింగ్ కూడా 20 శాతానికి పైగానే పూర్తయింది. దీని నుంచి హరీష్ శంకర్ రెండు టీజర్లు సైతం విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story

Most Viewed