Bank Strike: ఖాతాదారులకు బిగ్ అలర్ట్..2 రోజులు మూతపడనున్న బ్యాంకులు?

by Bhoopathi Nagaiah |
Bank Strike: ఖాతాదారులకు బిగ్ అలర్ట్..2 రోజులు మూతపడనున్న బ్యాంకులు?
X

దిశ, వెబ్‌డెస్క్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ బ్యాంకులు సమ్మె (Bank Strike) బాట పట్టే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తామని ఏఐబీఓసీ ( All India Bank Officers Confederation)తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ పాటించే ఛాన్స్ ఉందని పీటీఐ వార్త సంస్థ పేర్కొంది.

వారానికి ఐదు రోజుల పనిదినాలు(Five-day workdays), అన్ని కేడర్లలో తగిన నియామకాలతో పాటు ఇతర డిమాండ్ల కోసం ఫిబ్రవరి 24,25వ తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె(Nationwide strike)కు పిలుపునిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

డిమాండ్లు ఇవే?

-బ్యాంకు ఉద్యోగులకు వారికి 5 రోజులు పనిదినాలు(Five-day workdays) కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

-బ్యాంకులకు అన్ని కేడర్లలో నియామకాల(Appointments)ను చేపట్టాలి. ఉద్యోగ భద్రతను ముప్పుగా పరిగణించి.. ఉద్యోగుల్లో విభజనను కల్పించే పనితీరు సమీక్ష , పిఎల్ఐలపై డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Department of Financial Services)ఈ మధ్యే జారీ చేసిన ఆదేశాలను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

-ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్ మెన్(Workmen), ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల(Officer Director posts)ను భర్తీ చేయాలి. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యల(Pending issues)ను పరిష్కరించుకోవాలని కోరింది.

బ్యాంకు సమ్మె ఎప్పుడు ?

విధానపరమైన విషయాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులను డీఎఫ్ఎస్(DFS) సూక్ష్మ నిర్వహణ చేయడం ఆయా బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని యూనియన్ ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో 2 రోజుల పాటు అంటే సోమవారం(Monday), మంగళవారాలు(Tuesday) దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని తమ కార్యవర్గం ప్రతిపాదించిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ ( All India Bank Officers Confederation)ఓ ప్రకటన లో వెల్లడించింది.

అవసరం అయితే మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తేల్చిచెప్పింది. ఈ నెలలోనే సమ్మె నోటీసు(Strike notice) అందిన వెంటనే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ బ్యాంకులు నిజంగా సమ్మెకు దిగితే ప్రైవేట్ బ్యాంకులు ఈ సమ్మెల్ పాల్గొంటాయా లేదా అనేది చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed