Neha Shetty: వెల్వెట్ డ్రీమ్స్ అంటూ స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్

by Anjali |   ( Updated:2025-01-10 13:07:28.0  )
Neha Shetty: వెల్వెట్ డ్రీమ్స్ అంటూ స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహాశెట్టి(Neha Shetty) వరుస ఫొటో షూట్లతో కుర్రాళ్లను మంత్రముగ్దుల్ని చేస్తుంది. మోడల్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ ముంగరు మేల్ 2 (Mungaru Male) అనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ హీరోయిన్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో మెహబూబా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) సెకండ్ హీరోయిన్ గా, సిద్దు జొన్నలగడ్డ(Siddu jonnalagaḍḍa) తో డీజే టిల్లు మూవీలో నెగిటివ్ షేడ్స్ చూపించి.. తన సత్తా చాటింది. అనంతరం రూల్స్ రంజన్(Rules Ranjan), బెదురులంక(Bedurulanka), డీజే టిల్లు(DJ Tillu)కు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లు స్వ్కేర్ లో చివర్లో గెస్ట్ రోల్ లో.. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఇకపోతే ఈ అమ్మడు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంటోంది. తాజాగా నేహాశెట్టి వెల్వెట్ డ్రీమ్స్ అండ్ గోల్డెన్ గ్లీమ్స్ అంటూ క్యాప్షన్ రాసుకొస్తూ అదిరిపోయే ఫొటోలు అభిమానులతో పంచుకుంది. మెడకు సింపుల్ చైన్, చేతికి బ్యాంగిల్స్, సింపుల్ రింగ్ ధరించి.. ఖతర్నాక్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story