Robin Uthappa : యువీ కెరీర్ త్వరగా ముగిసేందుకు కోహ్లీయే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Robin Uthappa : యువీ కెరీర్ త్వరగా ముగిసేందుకు కోహ్లీయే కారణం.. రాబిన్ ఉతప్ప  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : యువరాజ్ సింగ్ కెరీర్ త్వరగా ముగియడానికి పరోక్షంగా కోహ్లీయే కారణమని రాబిన్ ఉతప్ప అన్నాడు. శుక్రవారం ఈ మేరకు లలన్ టాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప వివరాలు వెల్లడించారు. ‘యువీ క్యాన్సర్‌ను జయించి అంతర్జాతీయ జట్టులోకి రావాలని భావించాడు. టీ20, వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యూవీ సభ్యుడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూవీ ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అతడు ఇబ్బంది పడుతున్న విషయం కోహ్లీకి తెలుసు. ఈ విషయాలను తనకు ఎవరూ చెప్పలేదు.. నేనే గమనించాను. జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ అతనికి మద్దతు తెలపలేదు. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వ్యక్తికి ఫిట్‌నెస్ నిర్ధారించే నిబంధనల్లో మార్పులు చేయాలి. రెండు పాయింట్లు తగ్గించాలని యూవీ చేసిన రిక్వెస్ట్‌ను అంగీకరించలేదు. అయినా యూవీ టెస్ట్ పూర్తి చేశాడు. జట్టులో స్థానం సంపాదించిన ఛాంపియన్స్ ట్రోఫీలో సరైన ప్రదర్శన చేయలేదు. తర్వాత క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ధారించుకున్నాడు. నా దారే రహదారి అనే విధంగా కోహ్లీ వైఖరి ఉంటుంది. విరాట్ కెప్టెన్సీలో నేను ఎక్కువగా ఆడలేదు. ఫలితాలే కాదు వ్యక్తిగతంగా ఎలా వ్యవహరించామనేది కూడా ముఖ్యమే. రోహిత్ మాత్రం అందరిని కలుపుకుని పోతాడు.’ అని ఉతప్ప అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed