- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూసేకరణ వల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం : బండి సంజయ్
దిశ, కొత్తపల్లి : రాష్ట్రంలో చేపట్టిన రైల్వే లైన్ నిర్మాణ పనులు జాప్యం కావడానికి ప్రధాన కారణం భూసేకరణ సమస్యేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. పనుల కొనసాగుతున్న తీరును పరిశీలించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీని సందర్శించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ విషయంలో ఆశించిన స్థాయిలో సహకరించడం లేదన్నారు.
కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లైన్, ఆర్వోబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే మార్చి నాటికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. రూ.60 కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణం అనేక కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. రాబోయే 3 నెలల్లో ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు.