దేవుడికి పూజ చేసి దీపం పెడితే.. జరిగింది ఇదే

by Bhoopathi Nagaiah |
దేవుడికి పూజ చేసి దీపం పెడితే.. జరిగింది ఇదే
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పండుగ పూట విషాదం నెలకొంది. పట్టణంలోని బడా హనుమాన్ ఆలయ సమీపంలో నివాసముంటున్న సద్దనపు శ్రీనివాస్ ఇల్లు దగ్ధమైంది. బాధితుని వివరాల ప్రకారం పూజ గదిలో దీపం వెలిగించి బయటికి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ఇల్లు దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఆస్తి నష్టం జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు.

Advertisement

Next Story