BRS: రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఐడియాను భలే తస్కరించారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Ramesh Goud |   ( Updated:2025-01-10 09:34:15.0  )
BRS: రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఐడియాను భలే తస్కరించారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి కేటీఆర్ మొబిలిటీ వ్యాలీ ఐడియాను కవర్ పేజి మార్చి భలే తస్కరించారు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) ట్వీట్ చేశారు. సీఐఐ నేషనల్ మీటింగ్(CII National Meeting) లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఈ రోజు మీరు సీఐఐ మీటింగ్ లో ఆద్యంతం ఎలక్ట్రిక్ వాహనాల గురించే మాట్లాడారని, నిజానికి ఐదు సంవత్సరాల క్రితమే కేటీఆర్(KTR) వీటి గురించి జీవోలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే ఇండస్ట్రీలో ఆ బజ్ సృష్టించడానికే ఫార్ములా- ఈ రేసులను తీసుకొచ్చారని, దాన్ని మీరు అవినీతి అని అంటున్నారని, పైగా ఏలాంటి చర్చకు కూడా మీరు సిద్ధంగా లేరు.. ఎందుకు? అని ప్రశ్నించారు.

అంతేగాక అసలు మీ ఫ్యూచర్ సిటీకి మొబిలిటీ వ్యాలీకి తేడా ఏమిటో చెప్పండి అని నిలదీశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే గతంలో కేటీఆర్ మాట్లాడారని, మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది? అని, అసలు ఇందులో నేరమెక్కడున్నది అని మండిపడ్డారు. మీరూ రోజూ కక్ష సాధింపులు చేస్తూ ప్రభుత్వ పాలసీలన్నింటి మీద అక్రమ కేసులు పెడుతూ పోతే ఏ అధికారి పనిచేస్తడు.. ఏ కంపెనీ పెట్టుబడులు పెడ్తది, చెప్పండి? అని నిలదీశారు. ఇక రేవంత్.. మీ బందువులకు, బినామీలకు అప్పజెప్పినంత ఈజీ కాదు పారిశ్రామిక అభివృద్ధి అంటే.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడాల్సి ఉంటుందని సూచించారు. అంతేగాక ఇందులో ఎన్నో నిరాశలు తిరస్కారాలు ఉంటాయని, మీ పక్కన ఉన్న అధికారులను అడగండి చెబుతారు అని ఆర్ఎస్పీ(RSP) రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed