స్థానిక మంత్రి ఉత్తమ్ స్పందిస్తే బాగుంటుంది.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి

by Ramesh Goud |
స్థానిక మంత్రి ఉత్తమ్ స్పందిస్తే బాగుంటుంది.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని, ఒక్క తడికైనా నీళ్లిస్తే రైతన్నలు అప్పుల భారీన పడకుండా ఉంటారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (BRS MLA Jagadeesh Reddy) అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎండిన పొలాల పరిశీలనకు వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ (Congress) తెచ్చిన కరువేనని మండిపడ్డారు. అలాగే రైతుల ఉసురు తీస్తూ.. రాక్షసానందం పొందుతున్నరాని, దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈ మూడే కాంగ్రెస్ సిద్ధాంతాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని, మళ్ళీ కన్నీళ్ల పాలుచేసిన పాపం కాంగ్రెస్ దేనని, పొట్టకొచ్చిన పంటలను నీళ్ళులేక పశువులకు అమ్ముకునే పరిస్థితోచ్చిందని అన్నారు. ఏడాదిన్నర కాకముందే అన్నిరంగాల్లో ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయాయని చెప్పారు. కాలేశ్వరం కాకుండా ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండుతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని అన్నారు. మళ్ళీ కాళేశ్వరం మాకు అప్పగిస్తే ఒక్క ఎకరం ఎండిపోకుండా చూస్తామని, ఎండిపోయిన పంట పొలాల గురించి రైతన్నల కష్టాల గురించి ఏఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.

ఎండిన పొలాలను రైతన్నల కష్టాలను ఎక్కిరించడానికి రేవంత్ జిల్లాకు వస్తున్నట్టుందని, రేవంత్ (Revanth Reddy), కాంగ్రెస్ చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని ఆరోపించారు. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, కేసీఆర్ 10 వేలు ఇస్తే మేము 15 వేలు ఇస్తామని ఆశపెట్టి మోసం చేశారని అన్నారు. మంత్రులకు శాఖల గురించి అర్థం కాకపోతే కనీసం అధికారులను అడిగిన తెలుసుకుంటే మంచిదని సూచించారు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర బానిసలుగా (Andhra Slaves) పాలన కొనసాగిస్తున్న దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. కనీసం ఒక్క తడికైనా నీళ్లిస్తే కొంత మంది రైతులన్నా అప్పుల బారిన పడకుండా ఉంటారని, స్థానిక మంత్రి ఉత్తమ్ (Minister Uttam Kumar Reddy) స్పందించి ఇంకోక్కతడికన్నా నీళ్లివ్వాలని జగదీష్ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed