- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రవాదులు వెన్నులో వణుకు పుట్టించాలి.. మాజీ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ చరిత్రలో నిలిచే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఉంటుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ నుండి 50 వేల మంది బహిరంగ సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. సభ తర్వాత రాజకీయ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. స్వయంపాలన కోసం బీఆర్ఎస్ పోరాటం చేసిందని.. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఒప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే చిదంబరం ప్రకటన వచ్చిందని తెలిపారు. సీఎం అయ్యాక ఎవరూ ఊహించని రీతిలో కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. త్వరలో బీఆర్ఎస్ మెంబర్‌షిప్ కార్యక్రమం, కమిటీల నియామకం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల దాడిని సీరియస్‌గా తీసుకోవాలని.. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం గురించి ఆలోచించాలంటే ఉగ్రవాదులు భయపడాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.