- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ అధికారి

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(ACB) అధికారులకు ఓ అవినీతి అధికారి చిక్కారు. మత్య్సశాఖ(Fisheries Department)లో పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. అధికారులు పన్నిన వలకి చిక్కి గిలగిలకొట్టుకున్నారు. చివరకు శాఖా పరమైన చర్యలకు శిక్ష అనుభవించబోతున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో జరిగింది. పార్వతీపురం మత్స్యశాఖలో వేముల తిరుపతయ్య(Vemula Tirupathaiah) అధికారిగా పని చేస్తున్నారు. అయితే ఈ శాఖలో పని కోసం తిరుపతయ్యను ఓ వ్యక్తి ఆశ్రయించారు. తమ పని చేసి పెట్టాలని అడిగారు. ఇందుకు రూ. 60 వేలు ఇవ్వాలని తిరుపతయ్య డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. లంచం విషయాన్ని వివరించారు. ఈ మేరకు అధికారులు పక్కా స్కెచ్ వేసి తిరుపతయ్యను అదుపులోకి తీసుకున్నారు. శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమను ఆశ్రయించాలని, నిజం తెలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.