- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sucide : సైనైడ్ మింగి కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఉగాది పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఒకే కుంటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక గాంధీ బజారులో బంగారం వ్యాపారి కుటుంబం బంగారం తయారలోఉపయోగించే సైనైడ్ మింగి బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుమారుల్లో సంతోష్ పదో తరగతి, భువనేశ్ ఆరో తరగతి చదువుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో కలమాలు, ఆర్థిక సమస్యలే వారి బలవన్మరణానికి కారణం అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story