- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trump: ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే 50 శాతం సుంకం విధిస్తాం.. చైనాకు ట్రంప్ వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల విషయంలో చైనా (China)కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాపై విధించిన 34శాతం సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై అదనంగా 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. అంతేగాక ఆ దేశంతో చర్చలు సైతం నిలిపివేస్తామని తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఏప్రిల్ 8వ తేదీ నాటికి చైనా అమెరికాపై విధించిన 34 శాతం సుంకాన్ని రద్దు చేయాలి. లేదంటే ఏప్రిల్ 9 నుంచి చైనాపై అదనంగా 50 శాతం సుంకం విధిస్తాం’ అని పేర్కొన్నారు. చైనా తన ప్రతీకార చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘అమెరికాపై చైనా ఇప్పటికే రికార్డు స్థాయిలో సుంకాలు విధిస్తోంది. ద్రవ్యేతర సుంకాలు, కంపెనీలకు అక్రమ సబ్సిడీ, దీర్ఘకాలిక కరెన్సీ అవకతవకలకు పాల్పడటంతో పాటు 34 శాతం ప్రతీకార సుంకాలను వేసింది. నా హెచ్చరిక ఉన్నప్పటికీ అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే ఏ దేశమైనా.. మొదట్లో ప్రకటించిన వాటి కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని తెలిపారు. కాగా, గతవారం వివిధ దేశాలపై సుంకాలను ప్రకటించిన ట్రంప్ చైనాపై 34శాతం టారిఫ్స్ విధించారు. దీనికి చైనా సైతం ప్రతీకారంగా పరస్పర సుంకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించారు.