Thyroid: మహిళల్లోనే కాదు మగవారిని కూడా వెంటాడుతోన్న ఆ సమస్య..!

by Anjali |
Thyroid: మహిళల్లోనే కాదు మగవారిని కూడా వెంటాడుతోన్న ఆ సమస్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కువగా మహిళలు థైరాయిడ్(Thyroid) సమస్యతో బాధపడుతుంటారు. హార్మోన్లలో అసాధారణ స్రావాలు విడుదలైనప్పుడు థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. శిశువులతో సహా ఎవరిలోనైనా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. థైరాయిడ్ గ్రంథి లేకుండా లేదా సరిగ్గా పని చేయని గ్రంథితో జన్మించిన చాలా మంది పిల్లలకు వెంటనే లక్షణాలు కనిపించవని నిపుణులు చెబుతున్నారు. కానీ థైరాయిడ్ పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది. థైరాయిడ్ పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో తరచుగా సంభవిస్తుంది.

హైపో థైరాయిడ్ లక్షణాలు చూసినట్లైతే..

మలబద్ధకం(Constipation), నీరసం, చర్మం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం(Weight gain), వెంట్రుకలు పొడిబారడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం(Excessive bleeding), చలిని తట్టుకోలేక పోవడం, గర్భస్రావం(Miscarriage), గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం, థైరాయిడ్ గ్రంథి వాపు (goitre) ఇతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ఇప్పుడు కేవలం ఆడవాళ్లలోనే కాదు పురుషుల్లో కూడా థైరాయిడ్ గ్రంథి సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కానీ మగవారిలో కంటే స్త్రీలల్లోనే ఏడు రెట్లు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాగా నిపుణులు చెప్పిన ఈ లక్షణాలు కనుక మగవారిలో కనిపిస్తే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవచ్చని సూచిస్తున్నారు.

థైరాయిడ్ లక్షణాలు కొన్ని మహిళల్లో, పురుషుల్లో సేమ్ ఉంటాయి. కండరాల నొప్పి(muscle pain), ఏదైనా చిన్న పని చేయగానే అలసిపోవడం లాంటివి కనిపిస్తాయి. అలాగే పురుషుల్లో లైంగిక ఇంట్రెస్ట్(Sexual interest) తగ్గిపోతుంది. జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది. కానీ చాలా మంది మగాళ్లు ఈ సమస్యను పెద్దగా లెక్క చేయరు. వీటితో పాటు పురుషులకు చెస్ట్ పెరుగడం, కండరాల సాంద్రత తగ్గడం, వీర్య కణాల నాణ్యత(Sperm cell quality) తగ్గిపోవడం, సంతాన సమస్యలు(Parental problems) ఏర్పడటం, వెన్నెముక(spine), తుంటి బలహీనపడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాగా పురుషుల్లో ఈ సమస్యలు కనిపిస్తే లైట్ తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed