సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం.. నేటి నుంచే ప్రారంభం

by Jakkula Mamatha |   ( Updated:2025-04-04 07:03:48.0  )
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం.. నేటి నుంచే ప్రారంభం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ల్యాండ్ రిజిస్టేషన్ల(land registrations)కు సంబంధించిన సరికొత్త విధానం తీసుకు వచ్చింది. మొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలలోని ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో(Sub-Registrar's offices) ‘‘స్లాట్ బుకింగ్’’ విధానాన్ని అమలు చేయనుంది. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్లాట్ బుకింగ్(Slot booking) విధానం ద్వారా ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి(ఏప్రిల్ 4) నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది.

దీంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళితే స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఈ విధానం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు(శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో(Sub-Registrar's offices) ఈ నూతన విధానం అందుబాటులోకి రానుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed