- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పోక్సో కేసుపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(YCP leader Chevireddy Bhaskar Reddy) తప్పుడు ప్రచారం చేశారు. దీంతో తమ కూతురి గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయంలో అటు ప్రకాశం జిల్లాలోనూ చెవిరెడ్డిపై మరో కేసు నమోదు అయింది. దీంతో ఆయన స్ట్రాంగ్‌గా స్పందించారు. తనపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 11 సెక్షన్లతో కేసులు పెట్టినట్లు తెలిపారు. కుట్రలో భాగంగానే తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించి, కేసులు పెట్టి పాలన చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి సూచించారు. తాను ఎటూ వెళ్లలేదని, ఎన్ని కేసులు పెట్టినా పారిపోనని చెప్పారు. విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని, అవసరమైతే తన ఫోన్ కూడా పోలీసులకు ఇస్తానని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, అరెస్ట్ చేస్తే లీగల్‌గా పోరాటం చేస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.