- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Japan: అక్రమాలకు పాల్పడితే ఆత్మహత్య చేసుకోవాలి.. జపాన్ బ్యాంకు వింత నిబంధన
దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి సంస్థలో ఉద్యోగులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అనంతరం సంస్థ యాజమాన్యం విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన ఎంప్లాయిస్‌ని తీసేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా జపాన్‌లోని షికోకు (Shikoku) బ్యాంకు కఠినమైన రూల్స్ పెట్టింది. ఈ నిబంధనలతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బ్యాంకు వెబ్ సైట్‌లో పొందు పర్చిన వివరాల ప్రకారం.. తమ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడినా, నిధులు దుర్వినియోగం చేసినా లేదా ఈ చర్యలకు పాల్పడే వారికి సహకరించినా వారు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరే ముందే ఈ అగ్రిమెంట్‌పై సంతకం చేయిచుకుంటామని, అంతేగాక ఈ ఒప్పందంపై ఉద్యోగి రక్తంతో సంతకం చేయాలని రూల్స్ పెట్టింది. ఎంప్లాయిస్ బ్యాంకులోని డబ్బు దొంగతనం చేస్తే ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, అనంతరం వారు సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుందని వెబ్ సైట్‌లో పేర్కొంది.
షికోకు బ్యాంకు నిర్ణయం సర్వత్రా చర్చానీయాంశమయ్యాయి. అయితే తమ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు షికోకు బ్యాంకు స్పష్టం చేసింది. కాగా, షికోకు బ్యాంకును మొదట్లో 37వ జాతీయ బ్యాంకు అనే పేరుతో చాలా ఏళ్ల క్రితం స్థాపించారు. ఆ తర్వాత షికోకు బ్యాంకుగా మార్చారు. అయితే దీనిని ప్రారంభించిన టైంలోనూ బ్యాంకు చైర్మన్ మియురాతో పాటు 23 మంది ఉద్యోగులు తమ రక్తంతో ఇదే రకమైన ఒప్పందంపై సంతకం చేశారని అధికారులు తెలిపారు. తమ బ్యాంకులో ఎంతో కాలంగా ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, ఈ చారిత్రక సంప్రదాయాలకు కొనసాగించేందుకే మరోసారి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక నుంచి ఈ రూల్స్ మరింత కఠినంగా కొనసాగిస్తామని బ్యాంకు పేర్కొంది.