ఓ దొంగతనం....తల్లి, కొడుకుల ప్రాణం తీసింది

by Kalyani |
ఓ దొంగతనం....తల్లి, కొడుకుల ప్రాణం తీసింది
X

దిశ, అందోల్‌: దొంగతనం చేసిన పాపానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ (21), అతని తల్లి వడ్ల బాలమణి(46)లు చింతకుంట బ్రిడ్జి పై నుంచి మంజీరా లోకి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి చెందిన వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు హాజరయ్యేందుకు ఆదివారం టాటా ఏసీ వాహనంలో వచ్చారు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిశ్చయించుకొని ఆ వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌ చేశారు. తాగుడుకు బానిసైన గ్రామానికి చెందిన వడ్ల శ్యాం (21) టాటా ఏసీ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. ఆ వాహనంతో కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్ళగానే కాలువలో ఇరుక్కుపోయింది.

ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు దగ్గరలోని ట్రాక్టర్‌ను ఎత్తుకొచ్చి తీసేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్‌ కూడా చెడిపోవడంతో మరొక ట్రాక్టర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయతిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుప్రక్క వాళ్లు లేచి దొంగ..దొంగ అని అరవడంతో సమీపంలో ఏపీ 29 ఆర్‌ 9299 నంబరుగల బైకును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని ఓ దుకాణం వద్దనున్న సీసీ పుటేజీని గమనించగా బైకుపై యువకుడు వెళ్లినట్లుగా గుర్తించారు. ఆ యువకుడు చింతకుంట గ్రామస్తుడిగా తెలుసుకొని గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలతో సమావేశమై ఈ యువకుడిని తమకు అప్పగించాలని, లేనట్లయితే టాటా ఏసీ వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించినట్లు చింతకుంట గ్రామస్తుల సమచారం.

గ్రామ పెద్దలు సీసీ పుటేజీ ఫోటోను గుర్తించి వడ్ల యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం వడ్ల శ్యాం అతని తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి, చిన్నమ్మ మమతలు బుజరంపేటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మలు బస్‌లో బయలుదేరగా, శ్యాం తన తల్లితో బైకుపై బయలుదేరి చింతకుంట బ్రిడ్జిపైకి కుడివైపున బైకును ఆపి మొదటగా శ్యాం నీళ్లలోకి దూకగా వెంటనే తన తల్లి కూడా మంజీర నదిలోకి దూకేసిందని ప్రత్యక్ష సాక్షులు గ్రామస్తులకు తెలియజేశారు. వీరిద్దరూ నీళ్లలోకి దూకే సమయంలో చేపలు పట్టేవారు చూసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేర్వేరుగా వచ్చి చనిపోయిన స్థలం ఏ స్టేషన్‌ వైపు వస్తుందో నిర్దారించుకోకుండానే వెళ్లిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed