- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hementh soren: మోడీ, అమిత్‌షాలతో హేమంత్ సోరెన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) చీఫ్ హేమంత్ సోరెన్ (Hemanth soren) మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ (Pm modi), హోం మంత్రి అమిత్ షా (Amith shah), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), రాహుల్ గాంధీ (Rahul gandhi), ప్రియాంక గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)తో సమావేశమయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీతో పాటు ఇతర అగ్రనేతలందరినీ ఆహ్వానించారు. హేమంత్‌తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హేమంత్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్రనేతల ఆశీస్సులో కోసమే కలిశానని, భవిష్యత్ లోనూ మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 81 స్థానాలకు గాను 56 సీట్లలో గెలుపొందింది. నవంబర్ 28న సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.