- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వినూత్న ఆవిష్కరణకు సింగరేణి శ్రీకారం
దిశ, తెలంగాణ బ్యూరో: సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్‌లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత మిగిలిన సోలార్ విద్యుత్‌ను వృథా కాకుండా బ్యాటరీలో నిల్వ చేసే "బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను” పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకొస్తున్నామని మంగళవారం సంస్థ చైర్మన్ ఎన్. బలరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో, పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్న ఒక మెగా వాట్ నిల్వ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పద్ధతి ద్వారా నెలకు రూ. 13 లక్షలు, ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్ విద్యుత్ వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే ఏడాదికి రూ. 4.8 కోట్ల సోలార్ విద్యుత్ మిగులు ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని తెలిపారు. మందమర్రిలో ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న 11 భూగర్భ, 4 ఓపెన్ కాస్ట్ గనుల అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సగటున ఒక లక్ష 34 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా దీనిలో సుమారు ఒక లక్ష 14 వేల యూనిట్ల విద్యుత్ ను కంపెనీ వినియోగిస్తుందన్నారు. ఇంకా 20వేల యూనిట్ల విద్యుత్ మిగులుతుందన్నారు.
ఈ మిగులు టీజీఎన్పీడీసీఎల్‌కు ఉచితంగా అందజేయాల్సి వస్తుందన్నారు. అవసరమైనప్పుడు వినియోగించుకునే లా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కాన్పూర్ కు చెందిన మెస్సర్స్ మార్స్ ఇండియా యాంటేనాస్ అండ్ ఆర్ ఎఫ్ సిస్టమ్స్ అనే ప్రైవేటు కంపెనీకి ఒక మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు పనిని అప్పగించామని తెలిపారు. 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత నెలకు కేవలం 9 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు మాత్రమే చెల్లిస్తుంది. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు రూ. 4 కోట్ల రూపాయల ఆదా చేకూరిందన్నారు. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం విజయవంతం అయితే మరో రూ.4.8 కోట్ల ఆదా చేకురుతుందని ఎన్. బలరామ్ పేర్కొన్నారు.