Naga Chaitanya-Shobhita: రానా టాక్ షోకు నాగచైతన్య-శోభిత.. సీక్రెట్ లవ్‌స్టోరీని బయటపెట్టనున్నారా?

by Hamsa |
Naga Chaitanya-Shobhita: రానా టాక్ షోకు నాగచైతన్య-శోభిత.. సీక్రెట్ లవ్‌స్టోరీని బయటపెట్టనున్నారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, విలన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా బాహుబలి మూవీతో రానా క్రేజ్ పూర్తిగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆయన నంబర్ వన్ యారీ అనే టాక్‌ షోను కూడా హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రజెంట్ రానా దగ్గుబాటి నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల ఆయన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించిన ‘35 చిన్న కథ కాదు’ మూవీని నిర్మించారు. ఇది సెప్టెంబర్ 6న థియేటర్స్‌లో విడుదలై పాజిటిక్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రానా ఓ కొత్త టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిని అమోజాన్ ప్రైమ్‌ స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకోరాబోతుందని టాక్. అయితే ఈ షో కోసం రానా కొంతమంది సినీ సెలబ్రిటీలను గెస్టులుగా తీసుకురాబోతున్నాడని సమాచారం.

నాగచైతన్య, శోభిత, శ్రీలీల, బాలకృష్ణ, కరణ్ జోమర్, సిద్దు జొన్నలగడ్డ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నాగాచైతన్య, శోభిత లవ్ స్టోరీని కూడా బయట పెట్టబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఈ షో అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : శోభిత పెళ్లి వీడియో వైరల్.. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొన్నానంటూ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed