- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మోహన్‌బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్(Anticipatory bail) ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
కాగా జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి(Attack on journalist Ranjith) కేసులో మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు(Rachakonda Police) కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఆయన కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం సైతం అయింది. అయితే మోహన్ బాబు తరపున లాయర్లు వెంటనే స్పందించారు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు.
కాగా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య గొడవ జరిగింది. ఇదంతా జల్ పల్లి నివాసంలో జరిగింది. అయితే న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన నేపథ్యంలో జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.