- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
by Kalyani |
X
దిశ, శేరిలింగంపల్లి : ఇయర్ ఎండ్ పార్టీల కోసం యువత సిద్ధం అవుతున్న తరుణంలో వారిని మత్తులో ముంచేందుకు డ్రగ్స్, గంజాయి పెడ్లర్లు నగరానికి మాదకద్రవ్యాలను తీసుకువచ్చి అమ్మి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా గచ్చిబౌలి లో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. నగరంలోని జియాగూడకు చెందిన శ్రీకాంత్ (25) బీదర్ నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు గోపన్ పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. బీదర్ లో గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్న క్రమంలో శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుండి 9.3 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story