Manipur: మణిపూర్‌లో బాంబులు, రాకెట్లు స్వాధీనం.. చురచంద్‌పూర్‌ జిల్లాలో కలకలం

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో బాంబులు, రాకెట్లు స్వాధీనం.. చురచంద్‌పూర్‌ జిల్లాలో కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ (Manipur)లోని చురచంద్‌పూర్ (Churachandhpur) జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. చురచంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేట్ సమీపంలోని వంతెన కింద అనుమానాస్పద బాంబులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వాటిలో పేలని మూడు ఇంప్రూవైజ్డ్ రాకెట్‌లతో సహా బాంబులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి. అనంతరం అస్సాం రైఫిల్స్‌(Assam Ryfills) కు చెందిన బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి వాటిని నిర్వీర్యం చేశారు. అలాగే తొమ్మిది ఐఈడీలు, నాన్-ఎలక్ట్రిక్ కమర్షియల్‌కు చెందిన ఒక డిటోనేటర్, సేఫ్టీ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో చురచంద్ పూర్ జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితుల్లో ఆంగ్లో-కుకి వార్ మెమోరియల్ గేట్ కేంద్ర బిందువుగా ఉంది. గత ఏడాది మే 3న మెయితీ కమ్యూనిటీకి చెందిన గుర్తుతెలియని వ్యక్తులు గేటును తగలబెట్టేందుకు ప్రయత్నించారని, దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయని కుకీ సంఘం ఆరోపించింది. మరో ఘటనలో చురచంద్‌పూర్‌లోని టీజాంగ్ గ్రామ సమీపంలోని థాంగ్‌జింగ్ హిల్ వద్ద పేలని మూడు అధునాతన రాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో వీటిని గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed