- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : యేసు క్రీస్తు బోధనలతో సమాజంలో ప్రేమ, సామరస్యం : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : సమాజంలో ప్రేమ, సామరస్యం, సోదరభావాలను పెంపొందించేందుకు యేసు క్రీస్తు బోధనలు దోహదం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అన్నారు. ఇటీవలే జర్మనీలోని క్రిస్మస్(Christmas) మార్కెట్‌పై జరిగిన తీవ్రవాద దాడిని ఆయన ఖండించారు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు, దేశ ప్రయోజనాల కోసం భారతీయులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు.
‘‘ఇతరుల భారాలను మోయాలని యేసు క్రీస్తు బోధించారు. ఇలాంటి బోధనల ద్వారా ఈ ప్రపంచానికి బలాన్ని, శాంతిని అందించే మూలంగా బైబిల్ మారింది. మహోన్నత బోధనల స్ఫూర్తితోనే సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా ప్రయాస్ నినాదంతో భారత్ ముందుకు సాగుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చిలో కార్డినల్‌గా భారత్‌కు చెందిన ఫాదర్ జార్జ్ కూవకడ్‌ను నియమించినందుకు చాలా సంతోషం కలిగిందని మోడీ తెలిపారు. భారత పర్యటనకు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించానన్నారు.